తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Ration Scheme: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలకే సరుకులు

ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకుంటోంది. ఇక నవరత్నాల్లో ఒకటైన ఇంటింటికీ రేషన్ విధానం దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ వాహనాలు.. ప్రతి ఇంటిముందుకు వెళ్లి సరుకులను అందిస్తున్నాయి. దీంతో పేదలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. అయితే ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

Also read: Ambati Rambabu: నాగార్జునసాగర్ వద్ద సాగుతున్న వివాదం.. మంత్రి అంబటి కామెంట్స్

ప్రస్తుతం మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో పేదలు తమకి ఉన్నంతలో సర్దుబాటు చేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై కందిపప్పును ఈనెల నుంచే విక్రయించనుంది. ఇందుకు సంబంధించి అధికారులు సరిపడ స్టాక్ తెప్పించారు. ఇక మార్కెట్లో రూ. 150 నుంచి రూ. 180 వరకు ఉన్న కందిపప్పును కేవలం.. రూ. 67 కే అందిస్తోంది. కందిపప్పుతో పాటు చక్కెర, గోధుమ పిండిని కూడా పంపిణీ చేయనున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button