తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Betting: ఏపీ నెక్ట్స్ సీఎం ఎవరు? విశాఖలో జోరుగా సాగుతున్న బెట్టింగ్!

ఓట్ల లెక్కింపునకు ఇంకా ఐదు రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుందన్న దానిపై కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 9న ప్రమాణం చేసే సీఎం ఎవరు అంటూ మరో బెట్టింగ్ కాస్తున్నారు. జగన్ విశాఖలో సీఎంగా ప్రమాణం చేస్తారన్న దానిపై అతి పెద్ద మొత్తంలో బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: జూన్ నుంచి టాలీవుడ్‌లో హంగామా షురూ!

అంతేకాదు, విశాఖలోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు ఓటముల మీద, మెజారిటీల మీద కూడా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణంతో పాటు భీమిలీ గాజువాక అసెంబ్లీ సీట్లలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయన్న దాని మీద బెట్టింగులు అతి పెద్ద మొత్తంలో సాగుతున్నాయట. విశాఖలో బెట్టింగు రాయుళ్ల హుషారు చూసి రాజకీయ నేతలు, అభ్యర్థులు కూడా తమ గెలుపుపై ధీమాగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button