తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

BJP MLA: వైఎస్ఆర్ దేవుడన్న బీజేపీ ఎమ్మెల్యే.. వైరలవుతున్న వీడియో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. అందులో ఒకరు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. కామారెడ్డి నుంచి మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read: Maoists: మీరు ఇలా చేయగలరా?.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ లేఖ

వైఎస్ఆర్ అంటే తనకెంతో అభిమానమని.. ఆయనని ఆదర్శంగా తీసుకునే జిల్లాలో పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పాలనలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలా ఉండేవారో ఒక యాదార్థ ఘటనను వెల్లడించారు. ఆయనను కలిసేందుకు వచ్చిన ఓ రైతు సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించారని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button