తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: ఏపీలో ప్రగతి రథం.. అదే జగన్ అభిమతం

జగన్‌…జగన్‌…జగన్‌.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మార్మోగుతున్న పేరు. ప్రతిపక్షాల గుండెల్లో ప్రతిధ్వనుల సృష్టిస్తున్న పేరు కూడా అదే. ఆయన పేరు వింటేనే ప్రతిపక్షాల నేతలు గజగజ వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన ఆషామాషీ నాయకుడు కాదు. కేవలం ఎన్నికలప్పుడే హడావిడి చేసి, స్వార్థ రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలనుకునే నేత కాదు, జగన్ అంటేనే ఓ విజన్.. ఈ దేశ రాజకీయాల్లోనే ఓ కొత్త ఒరవడి సృష్టించిన గొప్ప దార్శనికుడు జగన్. అందుకే అధికారం చేపట్టిన అనతి కాలంలో ఏపీలో అద్భుతాలు సృష్టించగలిగారని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.

ALSO READ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. భారీ డిస్కౌంట్‌కు ఇవాళే లాస్ట్ డేట్

‘అమ్మఒడి’తో పెరిగిన విద్యార్థుల సంఖ్య

‘నవరత్నాలు’ పేరుతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిస్తున్నారు. వైఎస్సార్ చేయూత, జగనన్న చేదోడు, అమ్మఒడి, వాహనమిత్ర వంటి దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను ఏపీలో అమలు చేసి, అన్ని వర్గాల వారి మన్ననలు అందుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన ఉచిత వైద్యం, రైతాంగానికి ఆర్థిక భరోసా, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతుల కల్పన, ఐటీ ఒకటేమిటి? అన్ని రంగాల్లోనూ ఏపీని దూసుకెళ్లాలాగా పరిపాలనను అందిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యనందిస్తూనే మరోవైపు వారిని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయడం మరో ఎత్తు. డిజిటల్ బ్లాక్ బోర్డులు, ఉచిత ట్యాబులు, బైజూస్ వంటి సంస్థతో బోధనా కంటెంట్, ద్విభాషా టెక్స్ట్ బుక్కులు, బూట్లు, బ్యాగులు, నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో టీచర్లు.. ఇవన్నీ సీఎం జగన్ దీర్ఘ దృష్టికి దర్పణాలనే చెప్పవచ్చు.

ALSO READ: ‘సేవారత్న’ నగదు విషయంలో అసలేం జరిగింది??

పథకాలే…అభివృద్ధికి నిదర్శనాలు

జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్య, వైద్య, రవాణా, పరిశ్రమ.. ఒక్కటేమిటి అన్ని రంగాలు దూసుకుపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నామని స్వయంగా వారే చెబుతున్నారు. రాబోయే 25-50 ఏళ్ల తర్వాత మన రాష్ట్రం ఎలా ఉండాలో ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక రూపొందించుకుని, ఆ మేరకు పాలనను సాగిస్తున్నారు. అందుకే ప్రతిపక్షాలు, రాజకీయ శత్రువులు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button