తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు

నిరుపేద తల్లిదండ్రులకు ఆడపిల్లల విహహం భారం కావొద్దని వైసీసీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు వైఎస్సాఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద, మధ్యప్రజలు లబ్ధిపొందుతున్నారు. 2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న యువతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ద్వారా రూ. 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ రెండు పథకాల ద్వారా ప్రభుత్వం ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తూ వస్తోంది. ఇవాళ అందించనున్న మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 427.27 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

ALSO READ: జగన్ విజన్ గొప్పది.. చంద్రబాబు పనైపోయింది!

ఎవరు అర్హులు?

ఈ పథకానికి అర్హత సాధించాలంటే వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. ఇద్దరూ తప్పని సరిగా పదో తరగతి పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు రూ. లక్ష, బీసీలకు రూ. 50 వేలు, మైనారిటీలకు రూ. 1 లక్ష సాయమందిస్తున్నారు. మరోవైపు.. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే 1 లక్షా 20 వేల రూపాయలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 75 వేలు, దివ్యాంగులకు 1 లక్షా 50 వేల రూపాయలను వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button