తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: మంగళగిరిలో లోకేష్ పర్యటన… భవిష్యత్ కార్యచరణపై చర్చ

టీడీపీ నాయకుడు నారా లోకేశ్ చేపట్టిన సుదీర్ఘమైన యువగళం పాదయాత్ర ఇటీవల ముగిసింది. 226 రోజుల్లో 3132 కి.మీ.లు సాగిన యువగళం పాదయాత్ర… డిసెంబర్ 20వ తేదీన ముగిసింది. ఈఏడాది జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర.. విజయనగరం జిల్లాలో ముగింపు పలికారు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. అయితే పాదయాత్ర ముగిసిన తర్వాత ఈరోజు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా X లో పోస్ట్ చేశారు.

Also Read: పవన్ కల్యాణ్‌కు కొత్త టెన్షన్.. ‘జనసేన’ పేరిట మరోపార్టీ!

యువగళం పాదయాత్ర వల్ల దాదాపు 11 నెలల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించడంతో మంగళగిరి కుటుంబ సభ్యులు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారని పోస్ట్ లో తెలిపారు. ఈ సందర్భంగా తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో చర్చించానన్నారు.

Also Read: రాహుల్ గాంధీ మరో యాత్ర.. 14 రాష్ట్రాలు.. 6,200 కిలోమీటర్లు

మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని తెలిపారు. మంగళగిరిలో చేనేతలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై కూడా చర్చించానని పేర్కొన్నారు. పద్మశాలి బహుత్తమ సేవా సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button