తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan: జనసేనలో పెరుగుతున్న అసమ్మతి నేతలు… కీలక నేతలంతా జంప్?

టీడీపీ, జనసేన పొత్తు ఆ పార్టీల్లో చిచ్చుపెడుతోంది. మొదటి నుండి ఇరు పార్టీల అధినేతలు పొత్తుతో పనిచేస్తామని చెప్తున్నారు. అయితే మొదటి నుండి ప్రజాక్షేత్రంలో మాత్రం ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు కత్తులు దూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితాను విడుదల చేయడంతో అగ్నికి ఆర్జ్యం పోసినట్టయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. టికెట్ దక్కని జనసేన నేతలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి.. జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్‌తో భేటీ అయ్యి మంతనాలు జరిపారని సమాచారం. అసంతృప్తితో ఉన్న జన సైనికులను వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. వైఎస్ఆర్సీపీ ఉచ్చులో జన సైనికులు, వీర మహిళలు పడవద్దని.. రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ పోస్ట్‌‌లో రాసుకొచ్చింది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button