తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Political War: సీఎం జగన్ దెబ్బకు.. చేతులెత్తేసిన చంద్రబాబు…!

ఎన్నికలకు ఇంకా రెండు నెలలు సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ అంతుచిక్కని వ్యూహాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కంగు తింటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన ఆయన.. తన అరెస్టును రాజకీయం చేసి, సానుభూతి పవనాలతో ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని భావించిన చంద్రబాబుకు తలపోటు తప్పడం లేదు.

ALSO READ: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలక.. ‘బీసీ/ముస్లిం’ అభ్యర్థి’ కోసం జగన్ పట్టు.. నెల్లూరు వైసీపీలో ఆసక్తికర రాజకీయం

ఎన్నికల్లో విజయంపై నిన్న, మొన్నటి దాకా ప్రగల్బాలు పలికిన ఆయన చివరికి చేతులెత్తేసే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని, టీడీపీ హవానే నడుస్తుందని ఆయన భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వైసీపీలో టికెట్లు దక్కని వాళ్లకు గాలం వేసి, వారిని పార్టీలో చేర్చుకొని ఎన్నికల్లో సునాయాసంగా గెలుపొందాలని చంద్రబాబు ఆశించారు. కానీ అవి కాస్త గల్లంతయ్యాయి. వైసీపీ టిక్కెట్లు దక్కని నేతలు సైతం సంక్షేమ సారథి జగనన్న వెంటే ఉంటామని తేల్చుకోవడంతో టీడీపీ అధినేతకు నిరాశే ఎదురైంది. ఇక, ఆచితూచి అభ్యర్థులను ప్రకటిస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

ఆగమ్యగోచరంగా చంద్రబాబు పరిస్థితి

చాలా స్థానాల్లో టీడీపీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు పొత్తు ధర్మానికి కట్టుబడి జనసేనకు దాదాపు 35 నుంచి 40 స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక బీజేపీతో మరోసారి పొత్తు కోసం ఢిల్లీ పయనమైన బాబుకు.. తమకు 25 స్థానాలు కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని బీజేపీ పెద్దలు స్పష్టంచేయడంతో ఏం చేయాలో తోచడం లేదు. పొత్తు ధర్మాన్ని పాటించి ఆ రెండు పార్టీలకు దాదాపు 60 స్థానాలకు పైగా కేటాయిస్తే.. టీడీపీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ నేతలకు ఏం సమాధానం చెప్పాలో తెలీడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు ఆచితూచి అభ్యర్థులను ప్రకటిస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button