తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Prashant Kishor: బాబు రూటే సపరేటు.. ఖంగుతున్న పీకే

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు ఐ- ప్యాక్ లో పనిచేస్తున్నారనుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అందులో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేశారు. కానీ ఆ సంస్థ మాత్రం ఏపీలో వైసిపి కోసం పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఏమిటనేది ఎవ్వరూ చెప్పకున్నా.. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

Also read: CM Jagan: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు

అయితే.. శనివారం జరిగిన భేటీకి మనస్పూర్తిగా వచ్చారా.. లేక చంద్రబాబు బలవంతంతో కలిశారా.. అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రశాంత్ కిషోర్ తనను జూమ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడాలని చంద్రబాబును కోరారట. కానీ చంద్రబాబు మాత్రం పట్టుబట్టి విజయవాడకు వచ్చి కలవాలని కోరారని తెలిసింది. అందుకు సుముఖత వ్యక్తం చేసిన పీకే.. ఎట్టి పరిస్థితులలోనూ మీడియాకు ఈ విషయం తెలియడానికి విల్లేదని షరతు పెట్టారట. అయితే అన్న మాట ప్రకారం నడుచుకుంటే చంద్రబాబు పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది. ముందు సరేనని ఒప్పుకుని ఆఖరి నిమిషంలో ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేశారు. దీంతో ఎయిర్ పోర్టులో పీకే బయటకు వచ్చే సమయానికి మీడియా రెడీగా ఉంది. దీంతో ఆ పరిణామానికి పీకే అవాక్కయ్యారు. బాబు పన్నిన వలలో పడి ప్రశాంత్ కిషోరే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button