తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Guntur: మంత్రి రజనీ కార్యాలయంపై దాడి.. గుంటూరులో ఉద్రిక్తత

ఘర్షణలు, దాడులతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ కార్యాలయంపై తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. ప్రారంభానికి సిద్ధమైన కార్యాలయంపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలు తగలబెట్టారు. దీంతో గుంటూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Also Read డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం.. వన్డేలకు బై బై

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని విద్యానగర్‌లో మంత్రి విడదల రజనీ కార్యాలయం కొత్తగా నిర్మించారు. సోమవారం ఉదయం ఆ కార్యాలయ భవనం వద్దకు చేరుకున్న జనసేన, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాళ్లతో దాడి చేశారు.. అద్దాలు పగలగొట్టారు. పోలీసులు అడ్డుకోగా వారిని తోసేసి ధ్వంసం చేశారు. దాడి విషయం తెలుసుకున్న రజనీ వెంటనే కార్యాలయాన్ని పరిశీలించారు.

Also Read ఇస్రో ప్రయోగం సక్సెస్.. అమెరికా తర్వాత మనదే విజయం

ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలేది లేదు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి’ అని రజనీ తెలిపారు. కాగా ఈ దాడి ఘటనలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి ఎందుకు చేశారనేది మాత్రం తెలియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button