తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Two States: రెండు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ… జగనే టాప్

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేకపోవడం కూడా ఒకటి. అధికారంలో ఉన్న దాదాపు 10 సంవత్సరాల్లో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లకు కూడా పరీక్షలు నిర్వహించకపోవడం, కోర్టు కేసులు, పేపర్ లికేజీలు జరిగాయి. దాంతో నిరుద్యోగ యువతియువకుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో సంవత్సరానికి యావరేజ్ గా 16,082 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రొఫెసర్ కొదండరాం ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను ప్రారంభించారు. రెండు బస్సుల్లో నిరుద్యోగ యువత, కాంగ్రెస్ నేతలు కలిసి ఊరురా తిరుగుతూ బీఆర్ఎస్ వైఫల్యన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.

Also Read: కాంగ్రెస్ మార్క్ పాలన… మహిళలకు ఫ్రీ బస్సు ఎప్పుడంటే?

ఇంటికో ఉద్యోగమని ఆశచూపుతున్న చంద్రబాబు

తెలుగు రాష్ల్రాలు విడిపోయిన తర్వాత 2014 లో ఆంధ్రప్రదేశ్ కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆయన పాలనలో కూడా ఏపీ యువతియువకులకు ఉద్యోగా అవకాశాలు తక్కువగా లభించాయి. 2024 లో ఏపీలో మళ్ళీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెబుతున్నారు. అయితే అధికారంలో ఉన్న 9 ఏళ్ల పాలనలో ఆయన ఏం చేశారని ప్రజలు నిలదీస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని ఆశించిన తల్లిదండ్రులకు అప్పుడు నిరాశే ఎదురయింది.అయితే టీడీపీ పాలనలో సంవత్సరానికి యావరేజ్ గా 9 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయగలిగింది. 2019 లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమిని నిరుద్యోగ సమస్య కూడా ఓ కారణంగా మారింది.

Also Read: పార్టీ నాయకత్వానికి అనారోగ్యం.. గులాబీ పార్టీలో నిస్తేజం

అత్యధిక పోస్టులు భర్తీ

ఉద్యోగాల భర్తీ విషయంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కంటే పటిష్టమైన స్థితిలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. వీరిద్దరి కంటే అత్యధికంగా సంవత్సరానికి యావరేజ్ గా 46,832 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వాలంటీర్ పోస్ట్ లు కాకుండానే ఇన్ని పోస్టులు భర్తీ చేశారు. జగన్ పదవి కాలం పూర్తి కాక ముందే ఇన్ని ఉద్యోగాలను వేశారంటే ఎన్నికల సమయనికి మరెన్ని భర్తీ చేస్తారో చూడాలి మరి. కేసీఆర్, చంద్రబాబు నిరుద్యోగుల పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యం జగన్ కొనసాగించకుండా విద్య, ఉద్యోగాలకు ప్రముఖ్యత కల్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button