తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Volunteer: వృద్ధురాలి ఇంట్లో అగ్నిప్రమాదం.. ప్రాణాలకు తెగించిన వాలంటీర్

మచిలీపట్నం జిల్లాలో పెదపట్నం గ్రామంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలకు తెగించి ఓ వాలంటీర్ చూపిన ధైర్య సాహసాలపై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పెదపట్నం గ్రామ పంచాయతీలో విద్యుత్‌ సర్క్యూట్‌ తో తోకల దేవమణి ఇంట్లో మంటలు చెలరేగాయి. కాగా ప్రమాద సమయంలో ఇంట్లో ఇద్దరు చిన్నారులు, వృద్ధురాలు ఉన్నారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుకలో భాగంగా 3000 రూపాయల పింఛన్‌ అందించేందుకు వచ్చిన గ్రామ వాలంటీర్‌ చేబత్తుల ప్రియదర్శిని అగ్నిప్రమాదాన్ని గమనించారు. వెంటనే తోకల కిరణ్, బుంగా రమేష్ సహాయంతో ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి మంటల్లో ఉన్న ఇంట్లోకి ప్రవేశించింది. చుట్టుపక్కల గ్రామస్తుల సహాయంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా విజయవంతంగా పిల్లలను రక్షించింది. ఇరుగుపొరుగు ఇళ్లకు మంటలు వ్యాపించకుండా సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు సహకరించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమాచారాన్ని సర్పంచ్ అనూష రాజ్, జాతీయ విపత్తు బృందం, రెవెన్యూ అధికారికి సమాచారం అందించింది.

Also read: Nitish Kumar: జోరు పెంచుతున్న ఇండియా కూటమి.. కన్వీనర్ గా నితీశ్ కుమార్!

ఇక ప్రమాద విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా కోఆపరేటివ్ డైరెక్టర్ గాడిదేసి బాల జేసు రూ. 5000 తక్షణ ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా బాధితులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేయడంతో పాటు అవసరమైన సాయాన్ని త్వరలో అందజేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. విద్యుత్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో ఇంట్లో వైరింగ్‌తో పాటు టీవీ, బెడ్, బట్టలు, సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సీలు, డ్వాక్రా డబ్బులు మంటల్లో కాలిపోయాయి. సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ అధికారి వివరాలు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button