తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య ఏం జరిగింది.. అసలు కథ ఏంటి?

వైసిపి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వైఎస్ షర్మిల ఇప్పుడెందుకు అన్న జగన్ కు ఎదురుతిరిగింది. అసలు ఏం జరిగింది. ఎందుకు ఆమె కాంగ్రెస్ గూటికి వెళ్లారు. అన్న జగన్ చెప్పిన మాటలు ఆమెకు నచ్చలేదా.. లేక ఎవరైనా ఆమెను ప్రలోభ పెట్టారా. అసలు నిజానిజాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

అయితే షర్మిల 2019 ఎన్నికల్లో కడప లోక్ సభ సీటును జగన్ ను అడిగారట. కానీ అప్పటికే కడప జిల్లా రాజకీయాలను చూసుకుంటున్న వైఎస్సార్ దగ్గర బంధువులు పదవులు కేవలం మీ కుటుంబానికే కాదు కష్టపడే మాకు కూడా ఇవ్వాలని కోరగా వారు చెప్పింది కూడా న్యాయమే అని భావించిన జగన్ విమర్శలకు తావులేకుండా ఆ సీటును ఆమెకు ఇవ్వకుండా అవినాష్ తో కొనసాగించారు. ఇక ఎన్నికల తర్వత రాజ్యసభ ఎంపీగానైనా తనను ఎంపిక చేయాలని షర్మిల మరోసారి అన్నను సంప్రదించినట్టు సమాచారం అప్పటికే చిన్నాన్న సుబ్బారెడ్డి కూడా ఈసారి ఇవ్వట్లేదు అని.. బీసీ, ఎస్సీలకు ఎన్నో హామీలు ఇచ్చామని అందరికి సర్దుబాటు చేయాలని.. వచ్చే టర్మ్ లో తప్పకుండా ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం.

Also read: AP: నెరవేరనున్న మత్స్యకారుల కల… త్వరలో అందుబాటులోకి జువ్వలదిన్నె హార్బర్

మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల భర్త బ్రదర్ అనిల్ తనకు వేల కోట్ల విలువైన గని కాంట్రాక్టులు ఇవ్వాలని కోరాడు. కానీ అందుకు జగన్ ససేమిరా అనడంతో.. ఇక అప్పటి నుంచి అనిల్ కు జగన్ ను మధ్య దూరం పెరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే షర్మిలను తప్పుడు మాటలతో జగన్ పైకి ఉసిగొల్పాడు అనిల్. ఈ నేపథ్యంలోనే షర్మిల ఒక రోజు వైసిపిని తెలంగాణలో ప్రారంభిస్తున్నానని.. తనను అధ్యక్షురాలిగా నియమించాలని కోరింది. ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఉంటే ఏపీ ప్రజలకు న్యాయం చేయలేమని.. నాన్న తర్వాత మనం అక్కడ దృష్టి పెట్టలేదని.. అందుకే వద్దని జగన్ వారించాడు. జగన్ కి మొదటినుండి షర్మిల రాజకీయాలపై అంతగా అవగాహన లేదని షర్మిల అమాయకురాలిని, అందరినీ తేలికగా నమ్ముతుందని రాజకీయ పరిపక్వత అంతగా లేదని ఆయన అభిప్రాయం.

అయినా.. అనిల్ మాటల మాయలో పడిన షర్మిల అన్న జగన్, తల్లి విజయమ్మ చెప్పినా వినకుండా ఏకపక్ష ధోరణితో ప్రవర్తించారు. దీంతో చెల్లెలి బాగు కోసం జగన్ విజయమ్మను షర్మిల దగ్గరకు పంపారట. తర్వాత తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తల్లి విజయమ్మతో రాయబారం పంపారు షర్మిల. తెలంగాణలో 3వేల కిమి పాదయాత్ర చేసి సరిగ్గా స్పందన లేకపోవడం వలన విలీనం చేయడం సరికాదని, మన కుటుంబానికి ఉన్నదే క్రెడిబిలిటీ (విశ్వసనీయత) అని.. అదే మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని.. వద్దని వాదించారు. కావాలంటే ఖమ్మం ఎంపీగా లేదా పాలేరు అసెంబ్లీకి పోటీ చేయమని.. తాను అన్ని రకాలుగా సాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అలాగే పొంగులేటితో కూడా మాట్లాడరట. అయినా షర్మిల వినకుండా.. ఎన్నికల ముందే కాంగ్రెస్ లోకి విలీనానికి ఒప్పుకున్నారట. కాంగ్రెస్ పార్టీ వాడుకుని వదిలేస్తుందని.. వద్దని చెప్పి కనీసం పాలేరు నుండి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని చెప్పారు జగన్. పొంగులేటితో మాట్లాడి గెలిచేలా చూస్తా అని కూడా తాను హామీ ఇచ్చారట.

Also read: AP Elections: జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారా..?

కానీ అలా జరగకుండా బ్రదర్ అనిల్ తెరచాటున ఏఐసీసీ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తో మాట్లాడి.. షర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చేలా చక్రం తిప్పాడట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వేసిన ఉచ్చులో షర్మిల పడ్డారట. అందుకే తెలంగాణ కోసం పోరాడుతానని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏపీ వైపు చూడటం రాజకీయ అపరిపక్వతను నిరూపిస్తోంది.

ఎలాగైతే తెదేపా అధినేత ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడో.. అలాగే వైఎస్ఆర్ అల్లుడైన బ్రదర్ అనిల్ కూడా తమ స్వలాభాల కోసం తమ కుటుంబాన్ని వాడుకుంటున్నారు. అందకు నిదర్శనమే జగన్ కే కాదు వైఎస్ఆర్ కి కూడా ప్రత్యర్ధి అయిన బీటెక్ రవితో అనిల్ ఫోటోలు దిగడం చూసి వైఎస్ఆర్ అభిమానులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button