తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Joinings: టీడీపీకి జోష్.. సైకిల్ ఎక్కిన వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, మేకపాటి

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రాబోతున్నది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న పసుపు దళం ఎన్నికలు సమీపిస్తుండడంతో రోజురోజుకు పుంజుకుంటోంది. తాజాగా ఆ పార్టీలోకి భారీగా చేరికలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు. వారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సాదర స్వాగతం పలికారు.

చదవండి: తెలంగాణ మాదిరి ముందే రావొచ్చు: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

తాడికొండ (Tadikonda) నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందిన శ్రీదేవి, ఉదయగిరి (Udayagiri) నుంచి గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) కొన్నాళ్లుగా సీఎం జగన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. పొమ్మనలేక పొగబెట్టడంతో వారు పార్టీ మారారు. మంగళగిరిలోని (Mangalagiri) టీడీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యాలయంలో వారిద్దరూ పసుపు కండువా వేసుకున్నారు. వారితోపాటు మాజీ ఎమ్మెల్యే బూదాటి రాధాకృష్ణయ్య కూడా సైకిల్ పార్టీలో చేరారు. అనంతరం రామచంద్రాపురం, తంబళ్లపల్లి, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి కూడా భారీగా నాయకులు చేరారు.

చదవండి: గవర్నర్ ప్రసంగం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టో: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు

ఈ సందర్భంగా సీఎం జగన్ (Jagan)పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. సైకో పాలనకు సాగనంపే సమయం వచ్చిందని తెలిపారు. పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. అందరూ కష్టపడి పనిచేస్తే అధికారం (Power) సొంతం చేసుకోవడం చాలా సులువని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button