తెలుగు
te తెలుగు en English
జాతీయం

Alappuzha Court: బీజేపీ నేత దారుణ హత్య.. 15 మందికి మరణశిక్ష

కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో అలప్పుజ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 15 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. ఈ మేరకు మంగళవారం తీర్పు వచ్చింది. మరణ శిక్ష పడిన 15 మందిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పీఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారు.

Also read: BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి?

ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యకర్తగా రంజిత్ శ్రీనివాసన్ ఉన్నారు. 2021 డిసెంబర్ 19న ఆయన తన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండగా.. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి చొరబడిన ఎస్డీపీఐ, పీఎఫ్ఐ కార్యకర్తలు.. రంజిత్ శ్రీనివాసన్ ను ఇంట్లో అత్యంత దారుణంగా కొట్టి చంపారని కోర్టు నిర్థారించింది. తల్లి, భార్య, పిల్లల ఎదుట అత్యంత దారుణంగా హత్య చేయటం అనేది క్రూరమైన నేరంగా భావించిన కోర్టు.. 15 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

రంజిత్ శ్రీనివాసన్ హత్యకు కొన్ని గంటల ముందు.. డిసెంబర్ 18న రాత్రి అలప్పుజాలో ఎస్డీపీఐ.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కె.ఎస్.షా హత్య జరిగింది. ఆ హత్యకు ప్రతీకారంగానే.. బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్య జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button