తెలుగు
te తెలుగు en English
జాతీయం

CM Nitish Kumar: బీహార్ లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులకు శాఖలకు కేటాయింపు

బీహార్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీశ్ కుమార్ కొత్త కేబినెట్ లో మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరికి ఆర్థికం, ఆరోగ్యం, క్రీడా శాఖలను ఇవ్వగా, మరో ఉప ముఖ్యమంత్రి విజయ్‌ సిన్హాకు వ్యవసాయం, రోడ్లు భవనాలు, చిన్న నీటి పారుదల శాఖలను ఇచ్చారు. అలాగే, అత్యంత కీలకమైన హోంశాఖను మాత్రం సీఎం నితీశ్‌ తన దగ్గరే పెట్టుకున్నారు. వీరితో పాటు మరో ఆరుగురు మంత్రులైన విజయ్‌ కుమార్‌ చౌదరి, విజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, డాక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, శ్రవణ్‌ కుమార్‌, సంతోష్‌ కుమార్‌ సుమన్‌, సుమిత్‌ కుమార్‌ సింహాకు కూడా సీఎం నితీశ్‌ పలు శాఖలను కేటాయించారు.

Also read: Mallareddy: కొండగట్టుకు ఎమ్మెల్యే మల్లన్న.. 16 ఎంపీ సీట్లు గెలవాలని పూజలు

అయితే, నితీశ్‌ కుమార్‌ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయగా.. ఆ తర్వాత జేడీయూ- బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పడింది. కానీ, తర్వాత ఏడాదికే బీజేపీతో విభేదాలు రావడంతో కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీక్ కుమార్ కొత్త సర్కార్ ఏర్పాటు చేశారు. ఈ పొత్తులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, నితీశ్‌ మళ్లీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు.

కాగా, ఇటీవల ఆర్జేడీతో కూడా విభేదాలు రావడంతో ఇప్పుడు ఆర్జేడీ- జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చేసి.. మళ్లీ బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. బీహార్‌ లో బీజేపీ ముఖ్య నేతలు సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హాకు డిప్యూటీ సీఎం పదువులు వరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button