తెలుగు
te తెలుగు en English
జాతీయం

Congress: సోనియా గాంధీకి సీఎం రేవంత్ విషెస్.. ప్రముఖుల శుభాకాంక్షలు

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ 78వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షర లిఖితం. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సంకల్పం మీ సొంతం. తెలంగాణ తల్లి సోనియమ్మకు నాలుగు కోట్ల ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.’అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఇటీవల తెలంగాణ సీఎంగా తనను ప్రకటించినప్పుడు సోనియాతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

Also read: Congress: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే

మరోవైపు సోనియాగాంధీకి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా సోనియాగాంధీకి పుట్టిన రోజు విషెస్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button