తెలుగు
te తెలుగు en English
జాతీయం

Gaganyaan Astronauts: ప్రతిష్టాత్మకంగా గగన్‌యాన్ ప్రాజెక్టు… వ్యోమగాములను కలిసిన మోదీ

ఇస్రో త‌న గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమ‌గాముల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు. అయితే ఆ ప్ర‌తిష్టాత్మక మిష‌న్‌కు ఎంపికైన వ్యోమ‌గాముల‌ను ప్ర‌ధాని మోదీ దేశానికి ప‌రిచ‌యం చేశారు. ఇస్రో కీర్తిని చాటే ఆ న‌లుగురి పేర్ల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు. కేర‌ళ‌లోని తిరువనంత‌పురంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గ‌గ‌న్‌యాన్ మాన‌వ యాత్ర‌కు ఎంపికైన వ్యోమ‌గాముల వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Also Read: కేటీఆర్‌కు ఈగో వైఫైల ఉంటుంది… బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

గ్రూప్ కెప్టెన్ ప్ర‌శాంత్ బాల‌కృష్ణ నాయ‌ర్‌, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణ‌న‌న్‌, గ్రూప్ కెప్టెన్ అంగ‌ద్ ప్ర‌తాప్‌, వింగ్ క‌మాండ‌ర్ శుభాన్షు శుక్ల పేర్ల‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు. ఆ న‌లుగురికీ ఆయ‌న ఆస్ట్రోనాట్ వింగ్స్‌ను అంద‌జేశారు. తిరువ‌నంత‌పురంలో ఉన్న విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్ సెంట‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆ న‌లుగురికీ వింగ్స్ బ్యాడీల‌ను ప్ర‌జెంట్ చేశారు.

Also Read: కేటీఆర్‌కు ఈగో వైఫైల ఉంటుంది… బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

ఇవి నాలుగు పేర్లు కాదు… 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అని మోడీ అభివర్ణించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. 40 ఏళ్ల కిందట రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లగా… మళ్లీ ఇన్నాళ్లకు భారతీయులు అంతరిక్షంలోకి వెళుతున్నారని… అయితే ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button