తెలుగు
te తెలుగు en English
జాతీయం

Gandhi Jayanti 2023: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు

అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా విజయ్‌ ఘాట్‌లో లాల్‌ బహదూర్‌శాస్త్రీకి మోదీ నివాళులు అర్పించారు. మరోవైపు జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ మాటలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామని తెలిపారు.

జాతిపిత మ‌హాత్మాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవ‌లు, త్యాగాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్మ‌రించుకున్నారు. దేశానికి గాంధీజీ అందించిన ఆశ‌యాలు, సిద్ధాంతాలు, విజ‌యాల స్ఫూర్తి.. తెలంగాణ రాష్ట్ర సాధాన‌, ప్ర‌గ‌తి ప్ర‌స్థానంలో ఇమిడి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button