తెలుగు
te తెలుగు en English
జాతీయం

Jallikattu: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఇద్దరు మృతి

సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే సాంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా, ఈ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలో జరిగిన పోటీల్లో ప్రమాదవశాత్తు ఓ మైనర్‌ సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ పోటీలను వీక్షిస్తుండగా ఎద్దుల మధ్య నలిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ALSO READ: ‘టెక్కలి’ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం… చెలరేగుతున్న మంటలు

క్రేజ్‌.. తగ్గడం లేదు

తమిళనాడులో సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఈ ఉత్సవాలను చూసేందుకు జనం భారీగా తరలివస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి వాటిని లొంగదీసుకుంటారు. ఈ పోటీల్లో పలువురికి తీవ్ర గాయాలైన ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. కాగా, అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలను ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button