తెలుగు
te తెలుగు en English
జాతీయం

Karnataka: ఎయిర్ పోర్టులో రూ. 10కే భోజనం.. రూ. 5 కే టిఫిన్

ప్రస్తుతం రోజుల్లో సామాన్యుడు బయట భోజనం చేయాలంటే రూ.70 నుంచి 200 వరకు ఖర్చు పెట్టాల్సిందే. రోడ్డుపై అమ్మే వాళ్ల దగ్గర కూడా తక్కువలో తక్కువ 50 రూపాయలు ఇచ్చి భోజనం చేయాల్సిందే. చాలా చోట్ల ఒక వ్యక్తి తినేందుకు కనీసం 70 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో పెరిగిన నిత్యవసరాల ధరలతో అన్ని రేట్లు పెరిగాయి. ఇక అసలు విషయానికొస్తే.. కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Also read: Prashant Kishor: బాబు రూటే సపరేటు.. ఖంగుతున్న పీకే

సామాన్యులు, మధ్యతరగతి, వ్యాపారులు, విలాసవంతమైన వ్యక్తులకు గమ్యస్థానంగా ఉన్న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అల్పాహారం రూ. 5, మధ్యాహ్న భోజనం రూ.10కే అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరు విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో 2 ఇందిరా క్యాంటీన్‌లను ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

బెంగళూరులో ఇప్పటికే 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్‌లలో కేవలం రూ. 5కే అల్ఫాహారం, రూ. 10కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇందిరా క్యాంటీన్‌లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని.. వాటిని మూసేయాలని ఆలోచన చేశారు.

అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీఎం సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్‌లలో లంచ్, స్నాక్స్ మెనూను మార్చారు. రాగి ముద్ద, మంగళూరు రొట్టెలు సహా పలు రకాల భోజనాలు వడ్డిస్తున్నారు. ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా ఇందిరా క్యాంటీన్ లో భోజనం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

టిఫిన్ మెనూ( రూ.5):

సాంబారు ఇడ్లీ, చట్నీ ఇడ్లీ, పెరుగు బజ్జీతో వెజ్ పలావ్, ఖరాబత్ చట్నీ, చట్నీతో చౌచౌ బాత్, మంగళూరు బన్స్, సాధారణ బన్స్, జామ్ బ్రెడ్, చట్నీ పొంగల్, బూందీతో బిస్బెలేబాత్, సీజనల్ మామిడి చిత్రాన్నం

లంచ్ మెనూ (రూ. 10):

వెజిటబుల్ సాంబార్, ఖీర్ తో అన్నం (లేదా) తకరారీ సాంబార్, రైతాతో అన్నం (లేదా) టమోటా సాంబార్, పెరుగుతో అన్నం (లేదా) కూరగాయల రసం, ఖీర్‌తో రాగిముద్ద (లేదా) సాగు, ఖీర్‌తో చపాతీ

డిన్నర్ మెనూ (రూ. 10):

వెజిటబుల్ సాంబార్ తో అన్నం (లేదా) తకరారి సాంబార్, రైతాతో అన్న (లేదా) పచ్చిమిర్చి పులుసుతో రాగిముద్దె (లేదా) వెజ్ గ్రేవీతో చపాతీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button