తెలుగు
te తెలుగు en English
జాతీయం

Krishna River: తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ.. కేంద్రం చర్యలు

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయితీపై నేడు కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జల విద్యుత్ శాఖ అధికారులు, తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య హైబ్రిడ్ విధానంలో సమావేశం కానున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల తరలింపు అంశాలపై కేంద్రం అధికారులు చర్చించనున్నారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ మధ్య నీటి పంపకంలో ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది.

Also read: Pawan Kalyan: టీడీపీ, బీజేపీతో పొత్తుపై పవన్ కామెంట్స్.. ఎమన్నారంటే?

ఇక ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటిపంపకాలు, వివాదాల పరిష్కారానికి అవసరమైన అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలని కేంద్ర ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఇక కేంద్ర సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాంను తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రకు చెందిన పోలీసులు డ్యాం వద్ద నుంచి వెళ్లిపోయారు. డ్యాం కుడికాల్వ నుంచి ఏపీకి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button