తెలుగు
te తెలుగు en English
జాతీయం

Lok Sabha Election: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌‌పై BIG UPDATE!

దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైందని సీఈసీ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని తెలుస్తోంది. మార్చి 8 లేదా 9వ తేదీన కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ సమావేశం కానున్న నేపథ్యంలో ఆ తర్వాత ఏ క్షణాన్నైనా షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ALSO READ: నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు

అంతేకాదు, పరిస్థితులు అనుకూలిస్తే ఈసారి జమ్ముకశ్మీరులోనూ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి 12-13 తేదీల్లో ఈసీ బృందం జమ్ముకశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించనుంది. అనంతరం జమ్ము కశ్మీరు ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. గత (2019) లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10వ తేదీనే షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button