తెలుగు
te తెలుగు en English
జాతీయం

Modi: ఆయన ఓ మహా జ్ఞాని… కింగ్ ఆఫ్ ఫూల్స్

ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుందని, మధ్యప్రదేశ్ లో వచ్చేది బీజేపీ సర్కారే అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీపై ప్రజల్లో ఎంతో నమ్మకం, ప్రేమ ఉందని చెప్పారు. ఈ నెల 17న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చివరి రోజు ప్రచారంలో భాగంగా బేతుల్, షాజాపూర్​లో నిర్వహించిన బహిరంగ సభల్లో మోదీ మాట్లాడారు. మోదీ గ్యారంటీల ముందు ఫేక్ ప్రామిస్ లు పని చేయవని కాంగ్రెస్ కు తెలుసన్నారు. జమ్మూలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ అస్సలు ఊహించి ఉండదని విమర్శించారు.

సెల్ ఫోన్ ల తయారీలో రెండోవ స్థానం

రాహుల్ చేసిన ‘మేడ్ ఇన్ చైనా ఫోన్’ కామెంట్లపై మోడీ స్పందించారు. ఆయన ఓ మహా జ్ఞాని.. కింగ్ ఆఫ్ ఫూల్స్.. అసలు అతడు ఏ ప్రపంచంలో బతుకుతున్నాడు? ఇండియా సాధించిన విజయాలు చూసి ఓర్వలేకపోతున్నడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏడాదికి 20వేల కోట్ల విలువ కంటే తక్కువ ఫోన్లు తయారయ్యేవని…. దాన్ని 3.50 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. సెల్ ఫోన్ ల తయారీలో ఇండియా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.

మోడీ కి ఘనస్వాగతం

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ జార్ఖండ్ చేరుకున్నారు. బిర్సాముండా ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ ఆయనకు స్వాగతం పలికారు. జనజాతీయ గౌరవ్ దివస్. ట్రైబల్ ఐకాన్ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళులర్పిస్తారు. గిరిజనుల సంక్షేమం కోసం 24వేల కోట్లు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button