తెలుగు
te తెలుగు en English
జాతీయం

Narendra Modi: జమ్ముకశ్మీరుపై ప్రధాని మోదీ వరాల జల్లు

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జమ్ముకశ్మీరులో పర్యటించారు. రూ. 32,000 కోట్ల పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. జమ్ముకశ్మీరు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను అందించేందుకు విజయపూర్‌లో ఎయిమ్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్య్ర భారతదేశంలో జమ్ము కశ్మీరును ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్ముకశ్మీరును భారతదేశ చిత్రపటంలో కలిపామని గుర్తుచేశారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కశ్మీరీలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారని అన్నారు.

ALSO READ: వైసీపీలోకి వలసల పర్వం.. టీడీపీ నుంచి కీలక నేతలు!

విశాఖలో ఐఐఎం, తిరుపతిలో ఐఐటీ ప్రారంభం

త్వరలోనే వికసిత్‌ కశ్మీర్‌ కల సాకారం అవుతుందని, మోదీ గ్యారెంటీ అంటే ఇలా ఉంటుందని చెప్పారు. ఇవాళ జమ్ము నుంచి ఐఐటీ, ఐఐఎం, నవోదయ లాంటి విద్యాసంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తం 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్‌ ప్రాంగణాలను కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button