తెలుగు
te తెలుగు en English
జాతీయం

Nitish Kumar: జోరు పెంచుతున్న ఇండియా కూటమి.. కన్వీనర్ గా నితీశ్ కుమార్!

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి జోరు పెంచుతోంది. మరోవైపు సీట్ల పంపకాలపై ఇండియా కూటమి నేతలు చర్చలు జరుపుతున్న సమయంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కూటమికి కన్వీనర్‌గా బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌ని నియమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీలు ఈ వారంలో వర్చువల్‌గా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌తో మంగళవారం కాంగ్రెస్ చర్చించింది.

Also read: Congress: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. ముహూర్తం ఫిక్స్ అయిందా?

కూటమిలో ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మంగళవారం నితీష్ కుమార్.. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ని ఈ పదవికి ఎంచుకునే ఆలోచనపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికలు 2024 లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు దేశంలోని ఎన్డీయేతర విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి పేరుతో జతకట్టాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రధాన పార్టీలతో పాటు చిన్నాచితక పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి మొదటి సమావేశాన్ని సీఎం నితీష్ కుమార్ పాట్నాలో నిర్వహించారు. ఆ తర్వాత బెంగళూర్, ముంబై, ఢిల్లీ వేదికలుగా ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి. చివరి సమావేశం ఢిల్లీలో డిసెంబర్ 19న జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button