తెలుగు
te తెలుగు en English
జాతీయం

Rahul Gandhi: ప్రధాని మోడీ ఓబీసీ కాదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి ఓబీసీ కులంలో పుట్టలేదని.. ఆయన పదేపదే తన కులం గురించి అబద్దాలు చెబుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో తెలి కులంలో మోడీ పుట్టారని ఆరోపించారు. ఒడిశా రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలతో కొత్త వివాదం నెలకొంది.

Also read: KCR: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా.. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?

ఓబీసీ కులంలో పుట్టలేదు కాబట్టే.. మోడీ కుల గణన చేయటం లేదన్నారు. 2000 సంవత్సరంలో ఓబీసీ కులం కార్డును బీజేపీ మోడీకి ఇచ్చిందని.. కులంతో ఓట్ల రాజకీయం చేసిందని ఆరోపించారు. ఓబీసీ కులంలో పుట్టినట్లయితే.. ఎందుకు కుల గణన చేయటం లేదని రాహుల్ ప్రశ్నించారు. మోడీ తన కులం గురించి ఎప్పుడూ అబద్దాలే చెబుతారని.. పుట్టింది తెలి కులంలో అని కొత్తగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button