తెలుగు
te తెలుగు en English
జాతీయం

RN Ravi తమిళనాడులో మరో సంచలనం.. సీఎం స్టాలిన్ కు షాక్

గవర్నర్ల తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తుతోంది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల (Governor) తీరు వివాదాస్పదమవుతోంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టకుండా సమన్వయం చేసుకోవాలని వారం కిందట సుప్రీంకోర్టు గవర్నర్లకు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం కూడా కాలేదు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరే మరోసారి ప్రభుత్వ బిల్లులను (Bills) వెనక్కి పంపారు. దీంతో తమిళ రాష్ట్రంలో తీవ్ర వివాదం రాజుకుంది.

Also Read మీ అకౌంట్ చెక్ చేశారా? రూ.860 కోట్లు బ్యాంక్ ఖాతాల్లో జమ

తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కొన్ని బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. ఆ బిల్లులను చాలాకాలం పాటు తన వద్దే ఉంచుకున్న గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా వెనక్కి పంపారు. పెండింగ్ (Pending)లో ఉన్న 10 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపారు. ఆ బిల్లుల్లో వీసీల నియామకంలో గవర్నర్ అధికార పరిధిని తగ్గించడం.. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిని విచారించేందుకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి. వాటితోపాటు మొత్తం 10 బిల్లులను గవర్నర్ తిరస్కరించడంతో తమిళనాడులో మళ్లీ తీవ్ర వివాదం ఏర్పడింది.

Also Read తెలంగాణ తెచ్చింది ముమ్మాటికి కాంగ్రెస్సే

అయితే గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తీరుపై చర్చించేందుకు శనివారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. తిప్పి పంపిన బిల్లులను ప్రత్యేక అసెంబ్లీలో ఆమోదించి మళ్లీ గవర్నర్ కు పంపిస్తామని ఆ రాష్ట్ర స్పీకర్ అప్పావు తెలిపారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని (Development) గవర్నర్ అడ్డుకుంటున్నారని తెలిపారు.

కాగా, తిరస్కరించిన బిల్లులను మరోసారి అసెంబ్లీ (Assembly) ఆమోదం చేసి రెండోసారి పంపిస్తే గవర్నర్ విధిగా ఆమోదించాల్సి ఉంది. దీంతో ఆ బిల్లులకు మోక్షం లభిస్తుందని డీఎంకే (DMK) ప్రభుత్వం భావిస్తోంది. కానీ, గవర్నర్ తన అధికార పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తోంది. కొన్ని ఏళ్లుగా గవర్నర్, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button