తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Joinings: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. ఆదిలాబాద్ జిల్లాలో ‘కారు ఖాళీ‘

అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో సీనియర్ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. దీంతో ఆదిలాబాద్ లో ‘కారు’ ఖాళీ అవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జ్ గా ఉన్న మంత్రి సీతక్క సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీలో చేరారు.

చదవండి: కేసీఆర్ ను పరామర్శించిన సీఎం జగన్.. ఏపీ నుంచి ప్రత్యేకంగా రాక

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆదిలాబాద్ జిల్లా వెనకబడి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఆదిలాబాద్ ను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఎజెండానే మన అజెండా.. ప్రజల అభివృద్ధే మన అభివృద్ధి. ప్రజలతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుందాం’ అని తెలిపారు. త్వరలోనే ఆదిలాబాద్ లో పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తానని వెల్లడించారు. ‘ఆదిలాబాద్ లో త్వరలోనే సమావేశం నిర్వహిస్తా. లోక్ సభ ఎన్నికల కసరత్తుపై సమీక్ష నిర్వహించుకుందాం’ అని పేర్కొన్నారు.

చదవండి: కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల.. వైఎస్సార్ టీపీ విలీనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button