తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth Reddy: బానిసత్వాన్ని తెలంగాణ భరించదు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ జీవన శైలిలో స్వేచ్ఛ ఓ భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో దశాబ్ధి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వమన్నారు. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించమన్నారు. దాశరథి చెప్పినట్లు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా ప్రజలకు ఉందన్నారు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదని అన్నారు.

ALSO READ: వదిలిపెట్టను.. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా: పాండే

ప్రజా పాలన ఇదే..

2023, డిసెంబర్‌ 7న ప్రారంభమైన కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామన్నారు. ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతితోపాటు ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. అనంతరం తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి సీఎం రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్‌ విడుదల చేశారు. తెలంగాణ డ్రీమ్‌- 2050 మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button