తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: ఎన్నికలపై రేవంత్ రెడ్డి జోస్యం…కేసీఆర్ కు నిద్ర పట్టేనా?

తెలంగాణలో రాజకీయ పార్టీ మధ్య వాడివేడి మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ కు నిద్రపట్టని వార్త ఒక్కటి చెప్పారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మరన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధుల లిస్ట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే తమ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేరి తమ బలన్ని పెంచారని వ్యాఖ్యనించారు. టికెట్ల ప్రకటన నాటికి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరికలు ఉంటాయని చెప్పారు.

అంతేకాకుండా ఈసారి బీఆర్ఎస్ కు 25 సీట్లకంటే ఎక్కువ రావని రేవంత్ జోస్యం చెప్పారు. ఈ నెలలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటిస్తుందని… మరిన్ని ఆయుధాలు బయటపెడతామని… పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో అనడం ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 19 శాతం ఓట్లు అన్‌ డిసైడెడ్‌ మోడ్‌లో ఉన్నాయని.. ఇందులో మెజారిటీ ఓటు షేర్ తమకే వస్తుందన్నారు. సౌత్, నార్త్ ఓట్ పల్స్‌కు చాలా తేడా ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్‌లో బీసీ ఆశావాహుల కోసం పీసీసీగా తాను కొట్లాడుతానని రేవంత్‌ స్పష్టం చేశారు. సర్వే లో ఓసి, బీసీకి సమాన రిజల్ట్ వస్తే బీసీకే టిక్కెట్ ఇస్తామని… తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీలు అడగడంలో తప్పులేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే తాము ఎక్కువ ఇస్తామని రేవంత్ రెడ్డి కీలక ప్రకటనే చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button