తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: తెలంగాణ నుంచే రాహుల్ గాంధీ పోటీ?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహాలు రచిస్తోంది. 17 స్థానాలకు గానూ కనీసం 15 స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భారీ స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచే లోక్‌సభ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా భువనగిరి నియోజక వర్గాల నుంచి రాహుల్ పోటీ చేయాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: కేసీఆర్‌ను గద్దె దించింది తామే… కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు: బండి సంజయ్

గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి మాత్రం గెలుపొందారు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఆ పార్టీకి కంచుకోటలు. ఈ జిల్లాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలనూ హస్తం పార్టీనే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ఖమ్మంలో గెలిపించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాదు, రాహుల్.. తెలంగాణ నుంచి పోటీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపవుతుందని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button