తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KCR: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తురణంలో మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు లేఖ రాశారు. ‘రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. మా హయాంలో విద్యుత్ రంగంలో గణనీయ మార్పులు తీసుకొచ్చాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు, ప్రజలకు అందించాం’ అని పేర్కొంటూ 12 పేజీల లేఖ రాశారు. అన్ని రకాల చట్టాల నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్నారు.

ALSO READ: తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

‘విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంట్‌ ఏ మాత్రం సరిపోదు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడానికే కమిషన్‌ ఏర్పాటు చేశారు. మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చేసి చూపించేందుకే ప్రయత్నాలు. విలేకర్ల సమావేశంలో కమిషన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా’ అని కేసీఆర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button