తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Affidavit ఆస్తుల్లోనూ తగ్గేదేలే.. కేటీఆర్, హరీశ్ రావు ఆస్తులెన్నో తెలుసా.?

హైదరాబాద్: రాజకీయాల్లోనే కాదు సంపదపరంగా కూడా సీఎం కేసీఆర్ వారసత్వాన్ని కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు పుచ్చుకున్నారు. వీరిద్దరూ ఆస్తులపరంగా కేసీఆర్ కు సమీపంలో ఉన్నారు. ఈ బావమరుదులు కోటీశ్వరులే. అధికారులకు గురువారం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ పరిశీలించగా.. కేటీఆర్ కుటుంబానికి రూ.53 కోట్ల విలువైన ఆస్తి ఉండగా.. హరీశ్ రావు కుటుంబ ఆస్తులు రూ.24.29 కోట్ల మేర ఉన్నాయి.

బావకు గుంట లేదు.. మరిదికి భారీగా భూములు
ఆస్తుల చిట్టా సవివరంగా చూడగా.. కేటీఆర్ కు భూములు భారీగా ఉన్నాయి. 38.17 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బంగారం తక్కువేమీ లేదు. 4.8 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు. వ్యవసాయం ద్వారా సంవత్సరానికి రూ.94 లక్షల ఆదాయం తనకు వస్తుందని కేటీఆర్ ప్రస్తావించారు. అప్పుల విషయానికి వస్తే రూ.11.99 కోట్లు ఉందని తెలిపారు.

చదవండి: పాలమ్మిండు.. పూలమ్మిండు.. కానీ సొంత కారు కొనలేదు

ట్రాక్టర్, పిస్టల్
హరీశ్ రావు వివరాలు పరిశీలిస్తే.. ఒక్క గుంట భూమి లేదని అఫిడవిట్ లో పేర్కొనగా ఆస్తులు మాత్రం రూ.24.29 కోట్లుగా ప్రకటించారు. ఒక ట్రాక్టర్, పిస్టల్ ఉందని తెలిపారు. రూ.2.5 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉండగా.. అప్పులు రూ.11.50 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో హరీశ్ రావు పొందుపర్చారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న వీరు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. అధికారికంగానే కోటీశ్వర్లుగా ప్రకటించుకున్న వీరు అనధికారికంగా వేల కోట్లకు పడగలెత్తి ఉంటారని భావించవచ్చు. కుటుంబసభ్యులు, బినామీలు తదితర లెక్కలు తీస్తే వీరి ఆస్తులు కొండంత ఉండవచ్చు.

చదవండి: టికెట్లు అందరికీ ఇచ్చేశారు.. ఇక కాంగ్రెస్ గెలుపే ఆలస్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button