తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Lok Sabha: బీఆర్ఎస్ పని ఖతం… కాంగ్రెస్ దే పైచేయి… తేల్చేసిన మరో సర్వే

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ ట్రాకర్‌ పోల్‌ సర్వే సంచలన విషయాలను వెల్లడించింది. మొత్తం 17 లోక్‌ సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సగానికి పైగా స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ లోక్‌ సభ ఎన్నికల్లో కూడా రెండో స్థానానికే పరిమితం కానుంది. బీజేపీ అయోధ్య రామమందిరంపై, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైనే ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ప్రభావం తెలంగాణలో బీజేపీ ఉహిస్తున్నంతగా లేదు! ఫలితంగా ఆ పార్టీకి 2019లో వచ్చిన నాలుగు సీట్ల కంటే మెరుగైన ఫలితాలు రావడం కష్టతరంగానే కనిపిస్తుంది.

Also Read: వైసీపీలోకి వలసల పర్వం.. టీడీపీ నుంచి కీలక నేతలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ… రానున్న లోక్ సభ ఎన్నికల్లో సైతం సత్తా చాటబోతోందని పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ సర్వే తెలిపింది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 5 స్థానాలు… బీజేపీకి 2 నుంచి 4 పార్లమెంటు సీట్లను గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుందని వెల్లడించింది.

Also Read: ఎంఎస్‌పీ హామీ ద్వారా వ్య‌వ‌సాయంలో పెట్టుబ‌డులు పెరుగుతాయి: రాహుల్ గాంధీ

ఓట్ షేరింగ్ విషయానికి వస్తే కాంగ్రెస్ కు 40 శాతం, బీఆర్ఎస్ కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. 42 శాతం మహిళలు, 37 శాతం మంది పురుషులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం, అర్బన్ సెంటర్లలో 37 శాతం మంది కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం బాగుందని 34 శాతం మంది అభిప్రాయపడగా… పర్వాలేదని 33 శాతం మంది చెప్పారు. ఫిబ్రవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించినట్టు పీపుల్స్ పల్స్ తెలిపింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,600 శాంపిల్స్ సేకరించినట్టు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button