తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Election Commission: ఈసీ సంచ‌ల‌నం.. 608 నామినేషన్ల తిరస్కరణ.‌.

హైద‌రాబాద్‌: దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ (BRS Party ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంలో ఉన్నార‌ని చెప్ప‌డానికి దాఖ‌లైన నామినేష‌న్ల సంఖ్యే చెబుతాయి. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు మొత్తం 4,728 నామినేష‌న్లు వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి చూస్తే ప్ర‌భుత్వంపై ఎంత‌టి కోపంతో ఉన్నార‌నేది అర్థ‌మ‌వుతోంది. అయితే ద‌ర‌ఖాస్తు చేసుకున్న నామినేష‌న్ల‌లో (Nominations) వంద‌ల సంఖ్య‌లో ఎన్నిక‌ల సంఘం తిర‌స్క‌రించింది. ద‌ర‌ఖాస్తులు స‌జావుగా లేవ‌ని, నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేవ‌ని ఏకంగా 608 మంది అభ్య‌ర్థుల నామినేష‌న్లు తిర‌స్క‌రిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. భారీ సంఖ్య‌లో నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ‌కు (Rejected) గుర‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ద‌ర‌ఖాస్తుదారుల‌తోపాటు ప్ర‌తిప‌క్షాలు ఈసీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఈసీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు.

Also Read ప్రచారంలో కాంగ్రెస్ జోరు.. ఇక్కడే రాహుల్ 5 రోజులు మకాం

కాగా, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌యిన వారిలో నాగార్జున సాగ‌ర్ నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డి (Janareddy) ఉన్నారు. కోరుట్ల‌లో ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు, మిర్యాల‌గూడ‌లో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌, హుజురాబాద్ (Huzurabad)లో ఈట‌ల రాజేంద‌ర్ స‌తీమ‌ణి జ‌మున నామినేష‌న్లు ఈసీ తిర‌స్క‌రించింది. ఖ‌మ్మం (Khammam) బీఆర్ఎస్ అభ్య‌ర్థి పువ్వాడ అజ‌య్ కుమార్ నామినేష‌న్ పై అభ్యంత‌రాలు ఉండ‌గా వాటిని ప‌ట్టించుకోకుండా ఈసీ ఆమోదం తెలిపింది. ఆలంపూర్ గులాబీ పార్టీ అభ్య‌ర్థి విజ‌యుడు ప్ర‌భుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయ‌కుండానే పోటీ చేయ‌గా.. అత‌డి నామినేష‌న్ ఆమోదించ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

Also Read 100 రోజుల్లో 6 గ్యారంటీలు పక్కా.. నేను గ్యారంటీ

ఇలా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఈసీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీకి తొత్తుగా ఎన్నిక‌ల సంఘం (Election Commission) వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయా పార్టీల నాయ‌కులు మండిప‌డ్డారు. నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌యిన అభ్య‌ర్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button