తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Salman Khan: ‘టైగర్‌ 3’ కలెక్షన్ల వర్షం.. ఫస్ట్ డే ఎంతంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ నటించిన కొత్త చిత్రం ‘టైగర్‌ 3’. ఈ చిత్రానికి మనీశ్‌ శర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా మెప్పించాడు. కాగా, దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ రోజున బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.

రికార్డులు బద్దలు

తొలి రోజు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.44.5 కోట్లు వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 94 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ కలెక్షన్ల పరంపర ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైగర్ 3 మూవీ బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన దీపావళి సినిమాగా నిలిచింది. అయితే రానున్న వీకెండ్‌లో పెద్ద సినిమాలేవి విడుద‌ల లేక‌పోవ‌డంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ సినిమాకు ప్రీతమ్ మ్యూజిక్ అందించగా టైగర్ 3 మూవీని మేకర్స్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ లో నిర్మించిన బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా టైగర్ 3 నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button