తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Hyd: కేసీఆర్ కు సీఎం పరామర్శ.. త్వరగా అసెంబ్లీకి రావాలని ఆకాంక్ష

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) శస్త్రచికిత్స అనంతరం క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం వైద్యుల (Doctors) పర్యవేక్షణలో ఉన్నారు. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ తెలిపారు. పాలనలో ఆయన సలహాలు, సూచనలు తప్పక తీసుకుంటామని ప్రకటించారు.

Also Read గడ్డం తీసేస్తున్నారా.. రేపు తిరుమలకు తెలంగాణ మంత్రి ఉత్తమ్

హైదరాబాద్ (Hyderabad) సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి (Yashoda Hospital) ఆదివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ వెళ్లారు. ఆస్పత్రిలోకి రాగానే మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రేవంత్ రెడ్డిని ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లారు. కేసీఆర్ ను పరామర్శించి కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘మాజీ కేసీఆర్ ను పరామర్శించాను. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. క్రమంగా కోలుకుంటున్నారు. కేసీఆర్ వైద్యానికి (Treatment) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. త్వరగా కోలుకుని అసెంబ్లీకి (Assembly) రావాలని కోరా. తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో కేసీఆర్ మాట్లాడాలి. ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాం’ అని సీఎం తెలిపారు.

Also Read ట్రాఫిక్ లో చిక్కుకున్న తెలంగాణ సీఎం కాన్వాయ్

ఆహ్వానించదగ్గ పరిణామం
ఎన్నికల సమయంలో తీవ్ర విమర్శలు చేసుకున్న నాయకులు ఇప్పుడు పరస్పరం కలుసుకోవడం రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ విషయం. అధికారం కోల్పోయినప్పుడు ఎలాంటి అవాంతరాలు సృష్టించకుండా కేసీఆర్ హుందాగా ప్రగతి భవన్ వీడడంతో మొదలైన సుహృద్భావ వాతావరణం.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శతో మరో మెట్టు ఎదిగింది. పరామర్శ సమయంలో కేటీఆర్, రేవంత్ రెడ్డి పరస్పరం భుజం తట్టుకోవడం.. చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో సుహృద్భావ రాజకీయాలు కొనసాగుతాయని చెప్పడానికి ఇదే చక్కటి నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button