తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: తెలంగాణలో కొలువుల జాతర.. గ్రూ‌ప్-1 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ప్రస్తుతం రెండు జాతరలు కొనసాగుతున్నాయి. ఒకటి మేడారం శ్రీ సమక్క-సారలమ్మ జాతర కాగా, మరొకటి నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటనల జాతర.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతున్నారు. ఇప్పటికే స్టాఫ్ నర్స్, సింగరేణి, పోలీస్, గురుకుల టీచర్లకు నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం.. నిన్న 563 పోస్టులతో గ్రూప్ -1 ప్రకటనను వెలువరించింది. మరోరెండు రోజుల్లో 11 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెలువరించించేందుకు సైతం సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షను రెండుసార్లు నిర్వహించగా పేపర్ లీకేజీ, తదితర కారణాలతో రెండు సార్లూ రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో 60 పోస్టులను కలుపుకొని కొత్త నోటిఫికేషన్‌ను వెల్లడించింది.

ALSO READ: త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఈసారి ఛాన్స్ ఎవరికంటే?

వీరికి ఫీజు నుంచి మినహాయింపు

ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్షను మే లేదా జూన్‌ నెలలో, మెయిన్స్ పరీక్షను సెప్టెంబరు లేదా అక్టోబరులో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్నవారు కూడా మరోసారి దీనికి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. అయితే గతంలో అప్లై చేసుకున్నవారు ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. కొత్తగా అప్లై చేసుకునే వారు కమిషన్ వెబ్‌సైట్‌లో ఓటీఆర్‌ (వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

కేటగిరిల వారీగా పోస్టులు

కొత్త నోటిఫికేషన్‌లో మొత్తం 563 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. డిప్యూటీ కలెక్టర్, డీస్పీ, ప్రాంతీయ రవాణా అధికారి, సబ్ రిజిస్ట్రార్ సహా 18 రకాల పోస్టులు ఉన్నాయి. ఓసీ-209, ఈడబ్ల్యూఎస్‌-49, బీసీ(ఏ)-44, బీసీ(బీ)-37, బీసీ(సీ)-13, బీసీ(డీ)-22, బీసీ(ఈ)-16, ఎస్సీ-93, ఎస్టీ-52, దివ్యాంగులు-24, క్రీడాకారుల కోటాలో-4 పోస్టులు ఉన్నాయని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పూర్తి నోటిఫికేషన్ https://www.tspsc.gov.in/లో చూడొచ్చు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button