తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: కేసీఆర్ మొక్కే బీజేపీ నాశనానికి కారణం: అగ్గి రాజేసిన విజయశాంతి వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం విజయశాంతి (Vijayashanthi) తొలిసారి గాంధీ భవన్ (Gandhi Bhavan)కు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ (KCR) నాటిన ఒక మొక్క బీజేపీ నాశనమైందని ప్రకటించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని స్పష్టం చేశారు.

Also Read విజయశాంతి అలా చేరారో.. లేదో ఇలా ప్రమోషన్

విలేకరుల సమావేశంలో విజయశాంతి మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ నాటిన ఒక మొక్క బీజేపీని నాశనం చేసింది. బండి సంజయ్ (Bandi Sanjay) ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడంతోనే ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. సంజయ్ ను తీసేయొద్దని చెప్పినా వినకుండా అకస్మాత్తుగా తీసేశారు. అతడిని తీసేయడం లేదని మాకు చెప్పి ఆ వెంటనే సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి దింపేశారు. బీజేపీ తప్పు చేసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరాను’ అని తెలిపారు.

‘కేసీఆర్ అవినీతిపై (Corruption) చర్యలు తీసుకుంటామనే నమ్మకం ఇవ్వడంతోనే బీజేపీలో చేరాను. ఈ సందర్భంగా ఉద్యమకారులకు ఆ పార్టీ మాట ఇచ్చింది. కానీ నెలలు, సంవత్సరాలు గడిచినా కేసీఆర్ పై చర్యలు (Action) తీసుకోలేదు. సీఎం కేసీఆర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రధాని మోదీనే ప్రశ్నిస్తున్నా. ఆధారాలు (Proof) ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మోదీ, షా, నడ్డా వచ్చినప్పుడల్లా ఆరోపణలు చేస్తారు కానీ చర్యలు తీసుకోరు. మోదీకి మెజారిటీ ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని విజయశాంతి ప్రశ్నించారు.

Also Read మేం గెలుస్తున్నాం.. డిసెంబర్ 9న గడ్డం తీసేస్తా: ఉత్తమ్

‘బీఆర్ఎస్ పార్టీ (BRS Party), బీజేపీ రెండూ ఒక్కటే. ఆ పార్టీ కార్యకర్తలే పిచ్చోళ్లు. బీజేపీలో బయట మాట్లాడేది ఒకటి.. వెనుక జరిగేది మరొకటి. సీఎం కేసీఆర్ ఇచ్చే డబ్బులకు లొంగిపోయే వ్యక్తిని నేను కాదు. ఆ రెండు పార్టీలు నాపై దుష్ప్రచారం చేయిస్తున్నాయి. ఆ పార్టీలకు మంచి బుద్ధి (Mindset) రావాలని కోరుకుంటున్నా. నన్ను విమర్శించే వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి. సీఎం కేసీఆర్ ను గద్దె దింపడం కోసం ఎంత దూరమైనా వెళ్తా’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోకి రావడం సంతోషంగా ఉందని.. మా వాళ్లను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button