తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress Party: విజయశాంతి అలా చేరారో.. లేదో ఇలా ప్రమోషన్

కాంగ్రెస్ పార్టీలో అలనాటి తార, సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) అలా చేరారో.. లేదో ఇలా ప్రమోషన్ లభించింది. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ విజయశాంతి సేవలు వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ప్రచార, ప్రణాళిక కమిటీ ప్రధాన కోఆర్డినేటర్ (Chief Co-ordinator)గా విజయశాంతిని పార్టీ నియమించింది.

Also Read ఓయూ విద్యార్థుల ఆశాకిరణం ’కాంగ్రెస్ పార్టీ‘.. ఎన్నికల్లో మద్దతు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, దానికి తగ్గ ప్రణాళికలు (Planning) రూపొందించడానికి కాంగ్రెస్ (Congress Party) ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీలో చీఫ్ కో ఆర్డినేటర్ గా విజయశాంతి, 15 మందిని కన్వీనర్లుగా ఎంపిక చేశారు. సమర సింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఎరవతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వర్ రావు, ఒబెదుల్లా కొత్వాల్, రమేశ్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, ఆలీ బిన్ ఇబ్రహీం మస్కతీ, దీపక్ జాన్ కన్వీనర్లుగా నియమితులయ్యారు.

బీజేపీకి రాజీనామా చేసిన రాములమ్మ శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో చేరడంపై విజయశాంతి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఎంతో ఆదరణతో, సమున్నతమైన గౌరవంతో స్వాగతించిన కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి (Leadership) హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పోస్టు చేశారు.

Also Read బీఆర్ఎస్ కు మద్దతు పలకాలని ’ఉద్యోగి‘కి వేధింపులు.. ఈసీకి ఫిర్యాదు

కాగా, తమ పార్టీని వీడడంతో విజయశాంతిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడి వ్యాఖ్యలపై విజయశాంతి స్పందిస్తూ.. ‘ఈ రోజు ఒక ఛానల్ (TV Channel)తో మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ నన్ను ఎన్నో మాటలు అన్నారు. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ వాజ్ పేయి, అద్వానీ, బీజేపీ కానీ నేర్పలేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఇయ్యాల తెలంగాణ సమాజం అంటున్నది. నన్ను బాధపెట్టే మాటలతో విమర్శించే కన్నా అందుకు సమాధానం చెప్తే ఎంతో కొంతైనా సమంజసం కావచ్చు’ అని పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button