తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Amitabh: అమితాబ్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్.. క్రేజీ రిప్లై ఇచ్చిన బిగ్ బీ

వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ సమరానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మాదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ. 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ పై బిగ్ బీ అమితాబ్ కు ఆయన ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారట.

Read also: Jagapatibabu: హాలీవుడ్ లోకి వెళ్లబోతున్న సీనియర్ హీరో.. వైరల్ అవుతున్న న్యూస్

ఈ మ్యాచ్ ను చూసేందుకు సామాన్య ప్రజలతో పాటుగా దేశంలోని ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను మాత్రం ఫైనల్ మ్యాచ్ చూడొద్దంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అమితాబ్ మ్యాచ్ చూస్తే టీమిండియా ఓడిపోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు కాబట్టి.

అయితేఈ నమ్మకాన్ని అభిమానుల్లో కల్పించింది అమితాబే కావడం విశేషం. సెమీస్‌లో కివీస్‌పై టీమ్‌ఇండియా విజయం తర్వాత.. ‘‘నేను చూడనప్పుడే మనం గెలుస్తాం’’ అని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అమితాబ్ ను ఫైనల్ మ్యాచ్ చూడవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనిపై అమితాబ్ మరో ట్వీట్ చేశారు. ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button