తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Vijayasai Reddy: పురంధేశ్వరీ అది మీకే సాధ్యం.. విజయసాయిరెడ్డి కామెంట్స్

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిరోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా విజయసాయిరెడ్డి పురంధేశ్వరిపై కామెంట్స్ చేశారు.

Read also: AP Caste Census: ఏపీలో కులగణన.. రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం

”జగన్ ప్రభుత్వం సమగ్ర కులగణనకు శ్రీకారం చుట్టింది. దీనికి మీరు అనుకూలమా… వ్యతిరేకమా పురంధేశ్వరి గారూ? వేల కోట్ల ప్రజాధనం దోచుకున్న చంద్రబాబు గారి ప్రయోజనాలే మీకు ముఖ్యం కదా. ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? బీసీలు జడ్జిలుగా పనికిరారు. వారి తోకలు కత్తిరించాలనేది చంద్రబాబు పాలసీ. మీ విధానం కూడా అదేనేమో?” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరో ట్విట్టర్ పోస్ట్‌లో.. “పురంధేశ్వరికి కిందటి లోక్ సభ ఎన్నికల్లో విశాఖ స్థానం నుంచి పోటీ చేసినపుడు 20 పోలింగు బూత్‌లలో ఒక్క ఓటు కూడా పడలేదు. మరో 40 బూత్‌లలో పది లోపలే పడ్డాయి. అయినా ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలయ్యారు. అందరికీ అలా కలిసి వస్తుందా ఏంటి? కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే సాధ్యం.” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో”రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు…బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని. దాని గురించి ఏదైనా చెప్పగలరా పురంధేశ్వరి గారూ? మీరు పోటీ చేసే స్థానాన్ని మీ పార్టీ డిసైడ్ చేస్తుందా లేక మీ బావ గారు నిర్ణయిస్తారా? ఆయన మద్ధతు కోసమేగా మీరు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారు!” అని కామెంట్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button