తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Tiger-3: థియేటర్లో కత్రినా, సల్మాన్ స్టెప్పులు.. హల్చల్ అవుతున్న వీడియో

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జోడిగా నటించిన తాజా మూవీ టైగర్-3. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలోని ఓ థియేటర్లో హంగామా చేశారు. అభిమానులతో కాసేపు మాట్లాడారు. అనంతరం వారి కోరిక మేరకు మూవీలోని పాటకు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

Read also: Amitabh: అమితాబ్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్.. క్రేజీ రిప్లై ఇచ్చిన బిగ్ బీ

ఇక థియేటర్ కి వచ్చిన సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘నేను యాక్షన్ హీరోగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. అభిమానులు నాపై ఇంత అభిమానం చూపించడం అదృష్టంగా భావిస్తున్నా. ‘టైగర్-3’ విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి జానర్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన పని కాదు. యాక్షన్‌ సినిమాల్లోనూ కొత్తదనాన్ని ఆవిష్కరించాలి. ఇది హ్యాట్రిక్‌ విజయంతో సమానం. దీని కోసం ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ దృష్టిపెట్టాను’ అని అన్నారు. ఇక ఈ సినిమా ఐదురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button