తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Jagapati Babu: హాలీవుడ్ లోకి సీనియర్ హీరో.. వైరల్ అవుతున్న న్యూస్

సీనియర్ హీరో జగపతిబాబు ఇప్పుడు హాలీవుడ్ లోకి వెళ్లనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లో ఆయన ఎన్నో హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో విలక్షణమైన, విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ రాణిస్తున్నారు. ఇక ఆయన విలన్ గా చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా.

Read also: Navadeep: హీరో నవదీప్ కు కొత్త డౌట్.. నెటిజన్ల కామెంట్స్

కేవలం తెలుగులోనే కాక.. హిందీ, మలయాళం, తమిళ చిత్రాల్లో సైతం జగపతి బాబు నటించారు. కాగా ఈయన నటనకు ఫిదా అయిన హాలివుడ్ మేకర్స్ అక్కడ నటించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జగపతి బాబు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్ లో ఫ్యాన్స్ ను సలహా అడిగారు. నన్ను హాలీవుడ్ పిలుస్తోంది.. ఏమంటారు అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ పోస్ట్ ను చూసిన వారంతా కూడా హాలీవుడ్ ఎంట్రీనా అంటూ ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ ఎంట్రీకి మీరు అర్హులు వెళ్ళండని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం మిమ్మల్ని హాలీవుడ్ వాళ్లు భరించగలరా అని సరదాగా ఆట పట్టిస్తున్నారు.

3 Comments

  1. Hmm it appears like your website ate my first comment (it was super long) so
    I guess I’ll just sum it up what I wrote and say, I’m thoroughly enjoying your blog.
    I too am an aspiring blog blogger but I’m still new to everything.

    Do you have any tips and hints for rookie blog
    writers? I’d certainly appreciate it.

    My blog post: vpn coupon 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button