తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Mandamarri: బీఆర్ఎస్ కు మద్దతు పలకాలని ’ఉద్యోగి‘కి వేధింపులు.. ఈసీకి ఫిర్యాదు

అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ తనపై ఉన్నత అధికారి ఒత్తిడి తీసుకువస్తున్నారని ఓ ప్రభుత్వ ఉద్యోగి (Govt Employee) వాపోయాడు. ఎన్నికల్లో ఆ పార్టీకి సహకరించాలని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించాడు. ఇదే విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంఘటన మంచిర్యాల జిల్లాలో (Mancherial District) చోటుచేసుకుంది.

Also Read డీప్ ఫేక్ వీడియోలు దేశానికి తీవ్ర ముప్పు: మోదీ

వివరాలు ఇలా ఉన్నాయి.. మందమర్రి (Mandamarri) తహసీల్దార్ గా చంద్రశేఖర్ పని చేస్తున్నారు. అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ (Senior Assistant)గా మోహన్ విధులు నిర్వర్తిస్తున్నారు. చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ (Balka Suman)కు అనుకూలంగా వ్యవహరించాలంటూ తహసీల్దార్ తనపై ఒత్తిడి చేస్తున్నారని మోహన్ ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి అల్లుడు అని వివరించాడు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలిపాడు.

కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యాలయంగా మార్చేశాడని మోహన్ వాపోయారు. కార్యాలయంలో జన్మదిన వేడుకలు, ఇతర పార్టీలు యథేచ్చగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వద్ద పని చేయడంతో పెద్ద స్థాయిలో తహసీల్దార్ (Tahsildar)కు పరిచయాలు ఉన్నాయని వివరించారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో గులాబీ పార్టీకి అనుకూలంగా పని చేయాలని తహసీల్దార్ తనకు చెబుతున్నాడని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు డబ్బులు పంచాలని కోరితే వాళ్లు చెప్పినట్టు చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఇదే విషయమై తాను చెన్నూరు రిటర్నింగ్ అధికారికి (Returning Officer) ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదుపై ఎన్నికల అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

Also Read: తుఫాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతాడు: రాహుల్ గాంధీ

కాగా, ఈ ఆరోపణలపై తహసీల్దార్ చంద్రశేఖర్ స్పందించారు. మోహన్ చేసిన ఆరోపణలన్నీ (Allegations) అవాస్తవం అని కొట్టిపారేశారు. విధులు సక్రమంగా చేయాలని అడిగితే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. ఈ సంఘటన చెన్నూర్ (Chennur) నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు బీఆర్ఎస్ కు తొత్తులుగా పని చేస్తున్నారని ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆరోపిస్తోంది. బాల్క సుమన్ ఆగడాలు పెట్రేగిపోయాయని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ (Gaddam Vivek) ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా విజయం మాత్రం పక్కా నాదే అని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button