తెలుగు
te తెలుగు en English
జాతీయం

Deepfake: డీప్ ఫేక్ వీడియోలు దేశానికి తీవ్ర ముప్పు: మోదీ

ప్రముఖుల ఫొటోలు, వీడియోలతో అసభ్య రీతిలో సోషల్ మీడియాలో ఆకతాయిలు చేస్తున్న సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిసారి స్పందించారు. డీప్ ఫేక్ (Deepfake) వీడియోలు దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటని పేర్కొన్నారు. తనకు సంబంధించిన వీడియోను కూడా సృష్టించారని తెలిపారు. ఢిల్లీలోని (New Delhi) పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

చదవండి: తుఫాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతాడు: రాహుల్ గాంధీ

ఇటీవల సినీ తారలు రష్మిక మందన్నా (Rashmika Mandanna), కాజోల్ (Kajol), కత్రీనా కైఫ్ ల డీప్ ఫేక్ విడుదలై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. ఇవి సమాజంలో గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఇటీవల నేను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ (Viral) అయ్యింది. తెలిసినవాళ్లు కొందరు పంపగా ఆ వీడియో చూశాను. ఈ కొత్త డీప్ ఫేక్ వీడియోలపై మీడియా, పాత్రికేయులు అందరూ ప్రజలకు అవగాహన (Awareness) కల్పించాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

చదవండి: గీత, ఖురాన్, బైబిల్ వంటిది మేనిఫెస్టో: రేవంత్ రెడ్డి

‘అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల ఎదురయ్యే సవాళ్లను (Challenges) ఎలా ఎదుర్కోవాలి? వాటి నుంచి అప్రమత్తంగా (Alert) ఉండాలనే దానిపై అవగాహన కల్పించాలి. ఇలాంటి వీడియోలు వైరలైతే వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరించాలని చాట్ జీపీటీ (Chat GPT) నిర్వాహకులకు సూచించాను’ అని మోదీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button