తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND VS AUS: వరల్డ్‌కప్‌ తుదిపోరు.. అబ్బురపరిచే ఎయిర్‌షో రిహార్సల్స్‌

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ చివరిదశకు చేరింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ అభిమానులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్‌ ఫైనల్లో భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌ ప్రదర్శనలు ఇవ్వనుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు రెండు రోజులే ఉంది. మ్యాచ్ ఆరంభమయ్యే 10 నిమిషాల ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యేక ఎయిర్ షో జరగనుంది. దీనికోసం ఇప్పటికే రిహార్సల్స్ కూడా మొదలయ్యాయి. ఈ స్టేడియంపై సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. అబ్బుర పరిచే విన్యాసాలు చేస్తున్నాయి. ఈ రిహార్సల్స్‌ నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని స్థానికులు తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

విన్యాసాలు.. స్పెషల్ అట్రాక్షన్‌

ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. భారత్ ఆటగాళ్లు ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రెండు జట్ల మధ్య వరల్డ్‌కప్‌ తుదిపోరు ప్రారంభకానుంది. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఎయిర్‌షో రిహార్సల్స్‌ను నిర్వహిస్తోందని సమాచారం. అయితే మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు రకరకాల ఆకారాలతో అబ్బురపరుచనున్నాయి. గతంలోనూ వివిధ సందర్భాల్లో సూర్యకిరణ్ విన్యాసాలు ప్రదర్శించింది. మ్యాచ్ ఆరంభమయ్యే ముందు జరిగే సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్ అందరినీ థ్రిల్‌కి గురిచేయడం ఖాయమని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button