తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Shelterless Women ఇల్లు లేక బాత్రూమ్ లో మహిళ నివాసం.. ఇది కేసీఆర్ పాలన

యాదాద్రి: మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప దాటవు అన్న చందంగా సీఎం కేసీఆర్ పాలనా తీరు ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని గొప్పగా చెప్పుకుంటోంది. కానీ, చాలా నియోజకవర్గాల్లో ఆ ఇళ్ల నిర్మాణం పునాది రాయి కూడా పడని దుస్థితి. నాలుగైదు చోట్ల నాసిరకంగా కట్టేసి వాటినే రాష్ట్రమంతటా కట్టి ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తోంది. కేసీఆర్ పాలనలో పేదలకు ఇళ్లు దక్కలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ సంఘటన. వర్షాలకు ఇల్లు కూలిపోయి ఓ మహిళ బాత్రూమ్ లో జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం ఆదుకుంటుందని అనుకుంటే పట్టించుకోకపోవడంతో ఆ మహిళ దీనంగా కాలం వెళ్లదీస్తున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పరిస్థితి అధ్వానం
యాదాద్రి జిల్లాలోని రాజాపేట గ్రామంలో సీరిపంగ బాలనర్సమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె భర్త 15 ఏళ్ల కిందట మృతి చెందగా.. ఆమెకు ఒక కూతురు ఉండేది. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించగా ఒంటరిగా ఉన్న బాలనర్సమ్మ కూలీపనులకు వెళ్తూ కాలం వెళ్లదీస్తోంది. అయితే ఆమెకు ఉన్న ఇల్లు రెండేళ్ల కిందట కురిసిన వర్షాలకు కూలిపోయింది. ఉన్న గూడు చెదిరిపోవడంతో బాలనర్సమ్మ దిగాలు చెందుతోంది. ఉండడానికి చోటులేక బాత్రూమ్ లో ఉంటోంది. సామాన్లు అన్ని ఆ చిన్న గదిలో నివసిస్తోంది.

చదవండి: ఆస్తుల్లోనూ తగ్గేదేలే.. కేటీఆర్, హరీశ్ రావు ఆస్తులెన్నో తెలుసా.?

సాయం కోసం నిరీక్షణ
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఓ పార్టీ నాయకులతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వర్షాలకు ఇల్లు కూలగా.. గుడిసె వేసుకుంటే గాలిదుమారానికి ఎగిరిపోయిందని బాలనర్సమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఏ అధికారులు పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వం స్పందించి తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరుతోంది.

కాంగ్రెస్ ఆగ్రహం
బాలనర్సమ్మ లాంటి వారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇల్లు లేక పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. ఓట్ల కోసం ఇల్లు లేనివారందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. బాలనర్సమ్మ లాంటి వారి బాధ సీఎం కేసీఆర్ కు కనిపించదని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందని.. డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడిస్తారని చెబుతున్నారు. పేదలందరికీ డబుల్ ఇడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button