తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమేనా?

వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేయగా…గతంలో ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చారు. తర్వాత వైఎస్సార్‌టీపీ విలీనం పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలో షర్మిలకు మళ్ళీ కాంగ్రెస్ అధిష్టనం నుంచి పిలుపు రావడంతో రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.

గతంలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సందర్భంలో తాను పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ఆమె ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. అయితే షర్మిల సేవలను ఏపీలోనే వాడుకోవాలని, టీ.కాంగ్రెస్ నుంచి వద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం నేతలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నట్లు సమాచారం. అలాగే షర్మిల కూడా ఒక మెట్టు దిగి పాలేరు నుంచి పోటీ ప్రతిపాదనను విరమించుకున్నట్లు టాక్.

వైఎస్ షర్మిల తెలంగాణలో స్ట్రాంగ్ గా లేకపోయినా… ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఆమె అవసరం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే ఆమెకు తెలంగాణలో అంతా ప్రముఖ్యత లభించడంలేదు. వైఎస్సార్‌టీపీ, టీ. కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుందంటే కాంగ్రెస్ నేతల్లో ఆమె అవసరం మనకు ఎంత మాత్రం లేదనే భావనే కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అలా కాదు… మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుతూరు కావడంతో ఆమె కుటుంబంపై సదాభిప్రాయం ఉండడంతో కాంగ్రెస్ కు కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. అందుకే షర్మిల సేవాలను ఏపీకే పరిమితం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button